Important of Human Life

ఉద్యోగం.. వ్యాపారం చేస్తూ.. నేను బాగుండాలి.. నా వాళ్లు బాగుండాలి అని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాం.. చాలామంది ఇదంతా ఇప్పటి గురించే అనుకుంటారు.. మున్ముందు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల గురించి పట్టించుకునేవారు కొందరే. 
ఎంత మీ కుటుంబం కోసం కష్టపడుతున్నా.. కొన్ని సార్లు మీ స్వార్థం మీరూ కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి, అందరికీ కనీస పదవీ విరమణ ప్రణాళిక తప్పనిసరి అవసరం.
ద్రవ్యోల్బణ ఒత్తిడిని తట్టుకుంటే.. విశ్రాంత జీవితం ప్రశాతంగా సాగించాలంటే.. ఈ రోజుల్లో.. ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రస్తుతం రూ.15వేలు సరిపోతే.. 10 ఏళ్లనాటికి రూ.35వేలు కావాలని అంచనా. అంటే.. మన ఆదాయం పెరగకున్నా.. ఖర్చులు మాత్రం భారీగానే పెరుగుతుంటాయి. పైగా రానున్న రోజుల్లో ఇవి ఎలా ఉంటాయో తెలియదు. మనకు వచ్చే ఆదాయంకన్నా ఖర్చులే వేగంగా పెరుగుతాయన్నమాట. ఫలితంగా పదవీ విరమణ తర్వాత కూడా ఇలాంటి ప్రస్తుత స్థాయిలోనే జీవితం కొనసాగించాలంటే.. కొంచెం కష్టమే కావచ్చు. 
పదవీ విరమణ ప్రణాళిక ఇప్పుడు ఎంతో కీలకమైన అంశం. అయితే, దీనిలో కొన్ని కచ్చితమైన అంశాలను పాటించాలి. మీ ఆర్థిక లక్ష్యాలేమిటి? ఎంత వరకూ నష్టభయాన్ని తట్టుకోగలరు..ద్రవ్యోల్బణ శాతం ఎంత? తదితర వివరాలను పరిగణనలోనికి తీసుకోవాలి. పదవీ విరమణ చేసిన తర్వాత మీరేం చేయాలని చూస్తున్నారు.. ఇవీ ముఖ్యమే. ఒక్కో ఆర్తిక లక్ష్యానికి ఒక్కో విధమైన ప్రణాళిక అవసరం. మీ లక్ష్యాన్ని గుర్తించాకే దానికి అనువైన ఆలోచన చేయాలి. 

పింఛను పథకాలున్నాయి కదా... 
బీమా కంపెనీలు పింఛను పథకాలను అందిస్తున్నాయి. ఇవి దీర్ఘకాలిక పథకాలు. మీ లక్ష్యం. సమయాన్ని బట్టి వీటిలో సరిపోయే పథకాన్ని ఎంచుకోవచ్చు. బీమా కంపెనీలు అందించే పింఛను పథకాల్లో వ్యవధి తీరాక 30శాతం వరకూ సొమ్మును ఏక మొత్తంగా చెల్లిస్తారు. మిగతా సొమ్మును యాన్యుటీ పథకాల్లోకి మళ్లిస్తారు. ఒకేసారి వచ్చిన మొత్తంతో మీ అవసరాలను తీర్చుకోవచ్చు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వచ్చే సొమ్ము మీ రోజువారీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. 

ఆరోగ్య బీమా: పదవీ విరమణ తర్వాత అనారోగ్యం వస్తే.. అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకొని.. ముందు నుంచే ఆరోగ్య బీమాపై దృష్టి పెట్టాలి. ఆర్థిక ప్రణాళికలో ఇది తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే.. వయసు పెరిగిన తర్వాత పాలసీ మనం అనుకున్నట్లుగా రాకపోవచ్చు. దీన్ని నివారించాలంటే.. ముందునుంచే ఆరోగ్య పాలసీని తీసుకోవడం ఉత్తమం. ముందుగానే తీసుకుంటే.. తర్వాత ఏ ఆరోగ్య ఇబ్బంది వచ్చినా.. పాలసీ ఎలాంటి అభ్యంతరాలూ చెప్పదు. 
ఎండోమెంట్‌ పాలసీలతో : పొదుపు చేయడానికీ, బీమాకూ అవకాశం కల్పించే ఎండోమెంట్‌ పాలసీలు.. పదవీ విరమణ ప్రణాళికల్లోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగే పథకాలు. మీరు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించి, వ్యవధి తీరిన తర్వాత మీ పాలసీ విలువకు తోడు, బోనస్‌, ఇతర ప్రయోజనాల్లాంటివి పొందవచ్చు. మీ పదవీ విరమణ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, వరుసగా రెండుమూడేళ్లపాటు వ్యవధి తీరేలా నాలుగైదు ఎండోమెంట్‌ పాలసీలను తీసుకోవచ్చు......

No comments:

If have any questions please let me know

Theme images by jangeltun. Powered by Blogger.